అక్రమ వలసదారుల లెక్కలు తేలుస్తాం: కేంద్రం స్పష్టం

అక్రమ వలసదారుల లెక్కలు తేలుస్తాం: కేంద్రం స్పష్టం

అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన అక్రమ వలసదారులపై కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ దీనిపై ఓ ప్రకటనను చదివి వినిపించారు. వాళ్లు అక్రమంగా ఎలా తరలి వెళ్లారు? ఏజెంట్లు ఎవరు? అనే విషయాలపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని అన్నారు. విదేశాల్లో తమ పౌరులు చట్టవిరుద్ధంగా నివసిస్తోన్నట్లు తేలితే- వారిని స్వదేశానికి రప్పించుకోవాల్సిన బాధ్యత ఆయా దేశాలపైనే ఉంటుందని జైశంకర్ అన్నారు. అమెరికాలో బహిష్కరణ వ్యవహారాన్ని ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తుందని, ఇది- 2012లో అమలులోకి వచ్చిందని అన్నారు.

ఈ అథారిటీ- కొన్ని స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొటోకాల్స్‌ను రూపొందించిందని, బహిష్కరణకు గురైన వారిని ఆ దేశమే విమానాల ద్వారా తరలించాలంటూ అక్కడి నిబంధనలు స్పష్టం చేస్తోన్నాయని జైశంకర్ అన్నారు. మహిళలు, పిల్లలను ఇందులో నుంచి మినహాయించినట్లు తెలిపారు. బహిష్కరణ ప్రక్రియ కొత్తదేమీ కాదని స్పష్టం చేశారు. స్వదేశానికి వచ్చిన అక్రమ వలసదారులు అమెరికాకు ఎలా వెళ్లగలిగారనే విషయంపై ఆరా తీయడానికి అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని, అక్కడి నుంచి సమగ్ర వివరాలను తెప్పించుకుంటోన్నా మని చెప్పారు. చట్టబద్ధంగా ఏ దేశానికైనా వెళ్లే హక్కు అందకీ ఉందన, అక్రమంగా వలస వెళ్లాలనుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. ఎలాంటి డాక్యుమెంట్లు, అధికారిక పత్రాలు, వీసాలు.. లేకుండా అసలు వాళ్లు అమెరికాకు ఎలా వెళ్లారనే విషయంపై ఆరా తీయాలంటూ ఆదేశాలను జారీ చేసినట్లు జైశంకర్ తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow